నవతెలంగాణ – అమరావతి: వారసత్వంగా సంక్రమించిన భూమిని తన పేరున మార్చాలని కోరినందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా మండపల్లి తహసీల్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న పద్మరోజా శుక్రవారం బాధితుడు బోయిన సాయికిరణ్ వద్ద నుంచి రూ.38 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. మండలంలోని అయ్యవారి రుద్రవరంలో తన తాతల నుంచి సంక్రమించిన 1.25 ఎకరాల భూమిని తన పేరున మార్చాలని రెవెన్యూ అధికారులను సాయికిరణ్ ఆశ్రయించాడు. అయితే ఇందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ శరత్‌బాబు నేతృత్వంలో దాడి చేసి ఆర్ఐను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్ఐపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.