మాణిక్‌రెడ్డిని గెలిపించాలి

– టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
నవతెలంగాణ-మంచాల
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ఉపాధ్యాయులను కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మాణిక్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలన్నారు. ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడే గొంతుక కావాలంటే మాణిక్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం టీఎస్‌యూటీఎఫ్‌తోనే సా ధ్యం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాణిక్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్పుల గాలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సుగంధ, జిల్లా కార్యదర్శి కిషన్‌ చౌహాన్‌, మంచాల మండల అధ్యక్షులు ఎండి అజ్మత్‌ఖాన్‌, ప్రధాన కార్యదర్శి బాలునాయక్‌, యాచారం అధ్యక్షులు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు మోతిలాల్‌, మండల కార్యదర్శి వెంకటచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love