మానని ‘మణిపూర్‌’ గాయం-మౌనం వీడని మోడీ!

మణిపుర్‌లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో నూట ముప్తైకి పైగా సామాన్య ప్రజలు మరణించారు, 50వేల మందికి పైగా నిరాశ్రయుల య్యారు. చాలామంది ఇళ్లు తగలబడ్డాయి, దుకా ణాలు కాలి బూడిదయ్యాయి, ప్రార్ధనా స్థలాలు ధ్వంసమయ్యాయి. మూడు నెలలకు పైగా కొనసా గుతున్న ఉద్రిక్తతలు, హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అదుపు చేయలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రధాని నరేంద్రమోదీ మణిపూర్‌ విష యంలో పాటిస్తున్న భయంకరమైన మౌనం వీడ టానికి ఇద్దరు కుకీ మహిళలను నగంగా ఊరేగించి నట్టూ, వారిపైన సామూహిక అత్యాచారం జరిగినట్టే వీడియో సమాచారం వెల్లడి కావలసి వచ్చింది. మణిపూర్‌లో అలాంటి ఘటనలు వంద జరిగాయి. ఆ ఒక్క ఘటనను వీడియో తీసి వైరల్‌ చేశారు” ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. మణిపూర్‌ ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఏ మాత్రం సిగ్గుపడకుండ చెప్పిన మాట ఇది. ఈ మాట విన్నతర్వాత ఎవరికైనా మనం నాగరిక ప్రపం చంలోనే బతుకున్నామా? అన్న అనుమానం రాక మానదు. మనల్ని పరిపాలిస్తున్నది మనుషులా… డైనోసార్లా అన్న అనుమానం కూడా వస్తుంది. మహి ళలపై ఇంత ఘోరంగా ఆకత్యాలు సహజమేనన్న ట్లుగా చెబుతున్న ఆ సీఎం మానసిక స్థితిలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే..ఆయన రాజకీయ నాయ కుడు. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు..తమ సీటు తమకు ముఖ్యం అనుకునే నేత. మహిళలపై అలాంటి అరాచకాలు జరిగినప్పుడు ఏ సీఎం అయినా సిగ్గుతో తలదించుకోవాలి. కానీ ఆయన మాత్రం అవన్నీ కామనే అని జాతీయ మీడియాతో నిర్మోహమాటంగా చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ దేశం అయినా భారత్‌ను నాగరిక దేశంగా అంగీకరి స్తుందా? బయట దేశమెందుకు.. దేశంలోని ప్రజలు మన దేశం అభివద్ధి చెందుతున్నామని.. మనం పురో గమిస్తున్నామని ఎవరైనా అనుకుంటారా?. అను కునే ఛాన్స్‌లేదు. ఎందుకంటే ఆ మహిళలపై ఆకృ త్యానికి పాల్పడటానికి కారణం రాజకీయ పార్టీలు పెంచి పోషించిన కులం, మతం, వర్గం, ప్రాంతం అనే విషబీజాలే. అవే నేడు వట వృక్షాలై ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఘోరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల్లో విభజన తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తెచ్చిన రాజకీయ నేతలే నిస్సిగ్గుగా.. అవన్నీ మామూలేనంటూ ఏ పశ్చాత్తాపం వ్యక్తం చేయ కుండా మాట్లాడేస్తున్నారు. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని తీవ్రమైన వేదననూ, ఆగ్ర హాన్ని వెల్లడిస్తూ మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా? అంటూ కేంద్ర ప్రభు త్వాన్ని, మణిపూర్‌ ప్రభుత్వాన్ని మందలించిన తర్వాతనే మోడీ సుమారు మూడు మాసాల మౌనం వీడారు.
ఈ మౌనం వెనుక మెజారిటీవాదం ఉన్నది. ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి మాన భంగం చేసిన ఉదంతం మే 4వ తేదీన జరిగింది. అంతకు ముందు ఏప్రిల్‌ 14న హైకోర్టు తన పరిధి లో లేని అంశంపైన తీర్పు ఇచ్చింది. మెజారిటీ మైతీ లను ఆదివాసులుగా గుర్తించి వారికి రిజర్వేషన్లు అమలు జరగాలని నిర్ణయించింది. మహిళలపైన అత్యాచారం జరిగిన తర్వాత పక్షం రోజులకు మే 18న ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోరు తెరిచిన తర్వాతనే ప్రధాని మౌనానికి స్వస్తి చెప్పారు. ప్రధాని ఖండనలో సైతం రాజకీయం దండిగా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, అది రాజస్థాన్‌ కావచ్చు, ఛత్తీస్‌ఘఢ్‌ కావచ్చు, మణిపూర్‌ కావచ్చు.మహిళలను రక్షించ వలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకున్నది. చట్టాలను పకడ్బం దీగా అమలు చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.
మౌనం ప్రధానికి సంబంధించినంత వరకూ ఒక ఆయుధం. ఒక విధానం. ప్రముఖ సంపాదకు రాలు గౌరీలంకేష్‌ను హత్య చేసినా, ముగ్గురు హక్కుల నేతలను చంపివేసినా ప్రధాని మౌనాన్నే ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయా లని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు సంవత్సరం పొడుగునా నిరసన ప్రదర్శనలు చేసినా, మహిళా వస్తాదులు న్యాయం కావాలంటూ ఎన్ని మాసాలు జంతర్‌ మంతర్‌లో ప్రదర్శనలు చేసినా మౌనమే ప్రధాని సమాధానం. మణిపూర్‌లో వంద మందికి పైగా మరణించినా అదే మౌనం. మణిపూర్‌లోని ఇంఫాల్‌ లోయలో నివసించే మైతీలు మెజారిటీ తెగ.కొండలలో నివసించే కుకీల కంటే తక్కువ, కుకీలు క్రైస్తవులు. వీరు కాకుండా నాగాలు ఇంఫాల్‌ లోయ పక్కనే ఉంటారు. ఇటీవల నాగా మహిళను ఎవరో ఇంఫాల్‌ (మణిపూర్‌ రాజధాని)లో హత్య చేశారు. నాగాలు ఆగ్రహౌదగ్రులైనారు. సకాలంలో మణిపూర్‌ పౌర సమాజం నాగా మహిళ హత్యను ఖండించింది. మైతీల రాడికల్‌ సంస్థ ఆరంబై టెన్టోల్‌ హత్యను నిర్ద్వంద్వంగా ఖండించింది.అంతటితో నాగాలు సర్దుకున్నారు. లేకపోతే మైతీ-నాగా ఘర్ష ణలతో ఉత్తర మణిపూర్‌ రావణకాష్టంగా మారేది. దేశీయంగా మంత్రి అమిత్‌షా సైతం కర్నాటకలో ఎన్నికలు ముగిసిన తర్వాతనే మణిపూర్‌ సందర్శించారు.
ఢిల్లీ నుంచి కుకీలు నివసించే దక్షిణ మణిపూర్‌ కొండలలో శాంతి భద్రతలతో ముఖ్యమంత్రికి సంబంధంలేదు. ఢిల్లీ నుంచే నేరుగా కుకీల ప్రాంతంలో పరిపాలనను సాగిస్తున్నారు. ఢిల్లీ మద్దతు మైతీలకు ఉన్నది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించమని జూన్‌ 24న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నాయకులందరూ ముక్తకంఠంతో కోరారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన బీజేపీ ముఖ్య మంత్రిని తొలగించడానికి మోదీ ససేమిరా అంటున్నారు. అయితే మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన తర్వాత 79 రోజులకు మోదీ నోరు తెరిచారు. ఈలోపు ఆయన అమెరికా వెళ్లారు. ఫ్రాన్స్‌ సందర్శించారు. యునైటెడ్‌ ఎమిరేట్స్‌లో పర్యటించారు. అమెరికా పార్లమెంట్‌లో మాట్లాడారు. ఫ్రాన్స్‌లో భారత సంతతికి చెందిన ప్రవాస భార తీయులను ఉద్దేశించి అద్భుతంగా ప్రసంగించారు. భారత్‌ ఔన్నత్యాన్ని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్‌-3ని నింగికి పంపిన శాస్త్రజ్ఞులను పారిస్‌ నుంచే అభినందిం చారు. చిరుత పులులు చనిపోవడం గురించి మాట్లాడారు. ఈలోగా ఎన్ని కలు జరగబోతున్న మధ్యప్రదేశ్‌, తెలం గాణలో పర్యటించారు. కానీ మణి పూర్‌ వెళ్ళిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేశారు.
భోపాల్‌లో గంభీరోపన్యాసం చేస్తూ ప్రధాని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపి) నేతలు 70 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిపరుల గుట్టులన్నీ రట్టు చేస్తామనీ, అందరి లెక్కలూ తేలుస్తామని భీకర ప్రతిజ్ఞ చేశారు. ఈలోపే అదే ఎన్సీపీ నాయకులను మహారాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకున్నారు. 70 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపించిన అజిత్‌పవార్‌కు మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అవినీతి ఆరోపణలపైన కొన్ని మాసాలు జైలులో గడిపిన ఛగన్‌ భుజ్‌బల్‌ను మంత్రిగా చేసి ఆదరిం చారు. మోదీ దేశ విదేశాలలో పర్యటిస్తూనే ఉన్నారు. మణిపూర్‌ మాత్రం సందర్శించడం లేదు. మణిపూర్‌ లో జరిగినటువంటి ఘోరం రాజస్థాన్‌లో కానీ హిమాచల్‌ ప్రదేశ్‌లో కానీ, ఛత్తీస్‌గఢ్‌ కానీ జరిగి ఉన్నట్లయితే అక్కడికి మోదీ, షా, స్మృతి ఇరానీ వెంటనే వెళ్ళేవారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించే వారు. మానవ హక్కుల కమీషన్‌ నోటీసులు పంపించేది. పార్లమెంటు లో రచ్చ రచ్చ జరిగేది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించేవారు. కానీ మణిపూర్‌ బీజేపీ పాలనలో ఉంది. బీరేన్‌ సింగ్‌ బీజేపీకి చాలా ముఖ్యుడు. తనకు మహిళలపైన అత్యాచారం జరిగినట్టు ఎఫ్‌ఐఆర్‌ దాఖలయ్యే వరకూ తెలియ దని మొదట అన్నారు. నిజానికి ఇద్దరు కుకీ మహిళలను అల్లరిమూకకు అప్పగించింది పోలీసు లేనని ఆరోపణ. పోలీసులు చేసిన ఘనకార్యం గురించి కూడా తెలియని ముఖ్యమంత్రి అధికారం లో ఉండటానికి అర్హుడా?
పోలీసులలో, సాయుధ పోలీసులలో సైతం తెగ భేదాలు ఉన్నాయి. మైతీ పోలీసులు దక్షిణాదిన కొండలలో కుకీలు నివసించే ప్రాంతంలో పని చేయరు. పోలీసు శిక్షణ కేంద్రం నుంచి, కేంద్ర బెటాలియన్‌ నుంచీ, మణిపూర్‌ సాయుధ బెటాలియన్‌ నుంచీ 6.32 లక్షల బుల్లెట్లూ, 4,537 మర తుపాకులూ మాయమయ్యాయి. వీటిలో అయిదు శాతం మాత్రమే కుకీల చేతుల్లోకి వెళ్ళాయి. తక్కినవి మైతీల చేతుల్లో ఉన్నాయి. మణిపూర్‌ మహిళలు సాహస వంతులు.మైతీ మహిళలు జైలును ముట్టడించి 12 మంది కాగ్లీ యేవోల్‌ కెన్నా లుప్‌ మిటిటెంట్‌ గ్రూపుకు చెందిన యోధులను విడుదల చేయించారు.ఈ ఉదంతంలో చర్యలు లేవు.నిర్బంధాలు లేవు.విచారణ లేదు. 12 మంది మణిపూర్‌ మహిళలు కంగ్లాఫోర్ట్‌ నగంగా నిలబడి నిరసన ప్రదర్శన చేశారు.తమ హక్కులను హరించడం పట్ల నిరసన ప్రకటించారు.షర్మిల పదహారేళ్ళు నిరాహార దీక్ష చేసింది.ఏఎఫ్‌ఎస్‌ పీఏ(ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌)ను రద్దు చేయమని డిమాండ్‌ చేసింది.కల్లోలిత ప్రాంతాలలో అమలుచేసే ఈ చట్టం పరిధిని కుదించారు. అటువంటి మహిళలను సైతం మత సంఘర్షణలలో సమిధలు చేస్తున్నారు.

– నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140

Spread the love