నవతెలంగాణ – ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం మనీష్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోర్టును కోరుతూ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు బెయిల్ ఇచ్చింది. ఈ మూడు రోజులు ఆయన తన మేనకోడలు వివాహానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను 2023, ఫిబ్రవరి 26న సీబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి నుంచి దాదాపు సంవత్సరం కాలంగా ఆయన జైలులోనే ఉన్నారు. దీంతోపాటు మనీ లాండరీంగ్ కేసులో సిసోడియాను ఈడీ కూడా అరెస్టు చేసింది.