బీఆర్ఎస్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఇవాళ మరో అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఫైనల్ చేశారు. దీనిపై మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై ఈ నిర్ణయాన్ని ప్రక‌టించారు.

Spread the love