నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మంచు మనోజ్‌తో పాటు అతడి భార్యపై మోహన్ బాబు దాడిచేశాడని మోహన్ బాబు కొడుకు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రి నన్ను, నా భార్యను కొట్టాడని మనోజ్.. లేదు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో డిస్కషన్ రాగా.. చివరకు దాడులకు దారి తీసి కంప్లైంట్ వరకు వెళ్లినట్లు సమాచారం. ఒంటినిండా గాయాలతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.