– 15 రోజులలో నిర్మాణ పనులను పూర్తి చేసిన పులుగు ఎస్పీ డాక్టర్ శబరిస్
– గూడెంలో విద్యాలయం ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్యపేట అటవి సమీపంలో గల తక్కల్లపహాడ్ కు చెందిన పాయం తులసీ అనే విధ్యార్థిని జీతెలుగు డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకి సెలక్ట్ అయ్యింది. గొత్తికోయ బాలిక కావడంతో ఆ కార్యక్రమానికి జీ సంస్థ ముఖ్య అతిదిగా మంత్రి సీతక్కను ఆహ్వానించారు. ప్రోగ్రాంలో తన కళను ప్రదర్శించిన తులసిని అభినందించిన సీతక్క తన వివరాలను తెలుసుకుని ఏం కావాలి పాప నీకు అని మంత్రి అడిగిన మాటకు తమ గూడెంలో చదువుకోవటానికి బడి లేదు ఓ బడి కట్టించండి అని కోరింది తులసీ. గిరిజన బాలిక కోరికకు చలించిన మంత్రి ఈ విధులను జిల్లా ఎస్పీ శబరిష్ గారికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఎస్పీ శబరిస్ కిందిస్థాయి పోలీస్ అధికారుల ఫారెస్ట్ అధికారుల సహకారంతో అతి తక్కువ 15 రోజుల్లోనే పాఠశాల భవనాన్ని నిర్మించారు. అటవి ప్రాంతమైనప్పటికిని సంబందిత అధికారుల సహాయంతో కార్పోరేట్ స్థాయిలో విధ్యాలయం నిర్మించారు. తక్కువ సమయంలో పనులు పూర్తి చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సీతక్క పుట్టిన రోజు సంధర్భంగా ఈ రోజు ఆ విధ్యాలయాన్ని జిల్లా ఎస్పీ శబరీష్ తో కలిసి ప్రారంభించారు. 30 మంది విధ్యార్థులు ఉన్న ఆ గూడెంలో పాఠశాల ప్రారంబించడంతో తమ పిల్లలకు భవిషత్ బాగు పడుతుందని గూడెం వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా సీతక్క తన చదువు రోజులను, గిరిజనుల చదువు ఇబ్బందులను వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, దాతా తరుణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, మాజీ ఎంపీపీ ఎనిగంటి రామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.