సర్వేస్ రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్లకు పలువురు విజ్ఞప్తి

నవతెలంగాణ మల్హర్ రావు: మంథని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వూదరి సర్వేస్ గౌడ్ కు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని కాటారం,మహాముత్తారం, మల్హర్,పలిమేల, మహాదేవపూర్ మండలాలకు చెందిన ఇసునం మహేందర్ రావు, భగవాన్ రెడ్డి, పొట్ట పోచయ్య, రాజయ్య,పొట్టన్న, సురేందర్, చందు, రవిందర్, స్వామి, రవి తదితరులు తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల ఐదు సార్లు గెలుపుకోసం సర్వేస్ కృషి చేసినట్లుగా, నిస్వార్థంగా రాత్రి,పగలు సర్వేస్ బిఆర్ఎస్,బిజెపి, ప్రజా సంఘాల నాయకులతో చర్చించి, అనేకమంది సర్పంచ్, ఎంపిటిసిలను, మండల, గ్రామస్థాయి నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తూ దుద్దిళ్ల విజయానికి కృషి చేసినట్టుగా తెలిపారు. ఇందుకు ప్రతి ఫలితంగా సర్వేస్ కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Spread the love