మంత్రి  సమక్షంలో బీఆర్ఎస్ లో పలువురి చేరిక

– గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
 నవతెలంగాణ- కమ్మర్ పల్లి: సీఎం కేసిఆర్ గారి జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బాల్కొండ, మోర్తాడ్, భీంగల్, ఏర్గట్ల మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున సుమారు 100 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కుల నవీన్, సొసైటీ డైరెక్టర్ అబ్బన్న లక్ష్మణ్, మోహన్, సాయిలు, మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సాత్ పుతే మనోజ్, అంజు  ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎం.నవీన్, భూమేష్, సురేష్,  కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నోముల శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు,  భీంగల్ మున్సిపాలిటీ బోదిరే గల్లీ కి చెందిన కాంగ్రెస్ నాయకులు లింబాద్రి, సురేష్, గంగాధర్  కార్యకర్తలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరందరినీ  గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
3
Spread the love