పలువురు బీఆర్ఎస్ లో చేరిక 

బీఆర్ఎస్ లో చేరిన పలువురు
బీఆర్ఎస్ లో చేరిన పలువురు

నవతెలంగాణ కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంపులో గురువారం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నాగులు, కృష్ణారావు, శ్రీధర్ తదితరులు బీఆర్ఎస్ తీర్థ పుచ్చుకున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి కి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు మిర్జాపూర్ కాలనీ గ్రామస్తులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం అందజేశారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామస్తులుకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, మండల రైతు కన్వీనర్ కొల్లూరు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు

Spread the love