బీఆర్ఎస్ కు పలువురు రాజీనామా..

నవతెలంగాణ -పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు క్రియాశీలక నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మండల, గ్రామ పార్టీ అధ్యక్షులకు సోమవారం వాట్స్అప్ ద్వారా చేరవేర్చారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు నాయకులు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు బండారు వెంకన్న, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దంతాలపల్లి ఉపేందర్, మైనార్టీ ప్రచార విభాగం నాయకులు ఎస్కే సైదులు, గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు దంతాలపల్లి రవి, వార్డు సభ్యులు దంతాలపల్లి ఎల్లయ్య, దండగల నర్సమ్మ, మాలోతు సోమ్ల నాయక్, మాజీ వార్డు సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love