నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా జోన్ పరిధిలోని పలు రైళ్లను దాదాపు నెల రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు గుంతకల్-బీదర్(07671), బోధన్-కాచిగూడ(07275), కాచిగూడ-గుంతకల్(07670), కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-గద్వాల్ (07495), గద్వాల్-రాయచూర్ (07495), రాయచూర్-కాచిగూడ (17694), కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593) తదితర రైళ్లు సెప్టెంబరు 1వ తేదీ వరకు రద్దయ్యాయి.