అనారోగ్యంతో మన్య సీమ రాష్ట్ర సమితి కన్వీనర్ మృతి

నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని పంబాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకురాలు, మన్య సీమ రాష్ట్ర సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్, తెలంగాణ జాగృతి ములుగు నియోజకవర్గ మాజీ కన్వీనర్ నాలి పెంటమ్మ గురువారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతదేహానికి పలువురు ప్రముఖులు హాజరై పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి భర్త బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్ ను ఓదార్చారు.
హాజరైన ప్రముఖులు
మన్య సీమ రాష్ట్ర సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ నాలి పెంటమ్మ అంతక్రియలు సొంత గ్రామమైన పంభాపూర్ లో గురువారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. పంభాపూర్, దాని పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు తండోప తాండలుగా కదిలి వచ్చారు. గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రముఖులు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, ములుగు డివిజనల్ ఇంజనీర్ పులుసుం నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, సామాజిక న్యాయవేదిక ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు, ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న క్యాండెట్ (అభ్యర్థి) మడే పూర్ణిమ, వికారాబాద్ జిల్లా తాండూర్ డి ఈ ఎట్టి వెంకన్న, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎట్టి పాపారావు, జిసిసి డైరెక్టర్ పురుషం పురుషోత్తం, సర్పంచ్ లు ఎల్లబోయిన జానకి, మంకిడి నరసింహస్వామి, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ నాలి కన్నయ్య,  మాజీ సర్పంచ్ ముజఫర్ హుస్సేన్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నూశెట్టి రమేష్, మాజీ డైరెక్టర్ గడ్డం సత్యం, శివాలయం కమిటీ చైర్మన్ నాలి రవి, నాయకులు కల్తి నారాయణ, మూతి రామారావు,అర్రెం కృష్ణ, పాయం కన్నయ్య, ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, తుడుం దెబ్బ నాయకులు, మహిళలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love