
మావోయిస్టులారా వనం వీడి జనంలోకి రావాలని పసర పోలీస్ స్టేషన్ సిఐ శంకర్ అన్నారు. బుధవారం మండలంలోని మొద్దులగూడెం గ్రామంలోమావోయిస్టు నాయకుడు కొయ్యడ సాంబయ్య@ ఆజాద్@గోపన్న కుటుంబానికి పసర పోలీసుల చేయూత, నిత్యావసర సరుకులు అందజేసారు. ఈ సందర్భంగా సిఐ శంకర్ మాట్లాడుతూమావోయిస్టులారా వనం వీడి జనంలోకి రావాలని కన్నా తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జీవించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అనారోగ్యంగా ఉన్న వారికీ చికిత్స చేయిస్తామని, లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఈరోజు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిస్ ఆదేశాల మేరకు పసర పోలీస్ స్టేషన్ పరిధి లో మొద్దుల గూడెం లోని మావోయిస్టు రాష్ట్ర నాయకుడు కొయ్యడ సాంబయ్య @ ఆజాద్@ గోపన్న కుటుంబం ను పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా సీఐ , ఎస్సై లు సాంబయ్య తండ్రి,, భార్య ల యొక్క బాగోగులు అడిగితెలుసుకున్నారు.తర్వాత ఎస్పి ఆదేశాల మేరకు సాంబయ్య కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో రావాలని పిలుపు నిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున సరైన ఉపాధి అందిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులు అవసరాన్ని బట్టి మాట్లాడితున్నారని హింస ధోరణి అవలంబించడం వల్ల ఎంతోమంది అడవుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు . తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమానే సిద్ధాంతాలను అవలంబిస్తూ ప్రజలను కిందిస్థాయి మావోయిస్టులను తప్పుదోవ పట్టిస్తూ ముఖ్య నేతల మరణాలకు అగ్రనాయకులు కారణమవుతున్నారని ఈసందర్బంగా అన్నారు. అలాగే కొయ్యడ సాంబయ్య ఎక్కడ ఉన్నా లొంగిపోయిటట్లు సహరించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తర్వాత ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ తుపాకీ గొట్టం ద్వారా రాజాధికారం సాదించవచ్చు అనే అపోహ వదిలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత నేరవేర్చే వ్యక్తిగా ఉండాలని కోరారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేయుచున్న నాయకులు మరియు సభ్యులు ములుగు జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును మరియు జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని అన్నారు. నింగి పోవాలనుకుంటున్న మావోయిస్టులు వారి బంధువులు సంప్రదించవలసిన నెంబర్లు ఎస్ పి ములుగు 8712670100 ఓ ఎస్ డి ములుగు 8712670101 ఏ ఎస్ పి ఏటూరునాగారం 8712670104, డి ఎస్ పి ములుగు 8712670103, సీఐ పసర 8712670112,,ఎస్సై పసర8712670085 కార్యక్రమంలో పస్రా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.