బీజాపూర్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

నవతెలంగాణ – రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్‌  జిల్లాలోని పుస్నార్‌, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు  తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షిణి ధృవీకరించారు. గత ఏప్రిల్‌ నెలలో దంతేవాడ  జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. దీంతో పది మంది జవాన్లు, వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందారు. అర్ణాపూర్‌ స్టేషన్‌ పరిధిలో రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డులు  మావోయిస్టుల కోసం గాలింపు నిర్వహించి తిరిగి క్యాంపునకు వస్తుండగా మందుపారత పేల్చినట్లు అధికారులు తెలిపారు.

Spread the love