
– వివాహితను హత్య చేసిన కర్ణాకర్ ను వెంటనే శిక్షించాలన గుంటుపల్లి గ్రామస్తులు
నవతెలంగాణ-మిరు దొడ్డి : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. భర్తనే భార్యను హత్య చేశాడంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం గతంలో వేధింపులకు గురి చేయడం జరిగిందని వాపోయారు. మిరుదొడ్డి మండలంలో ఘోరం చోటుచేసుకుంది. మొగుళ్ల పద్మ – కమలాకర్ కు రెండు సంవత్సరాల క్రితం వర్గల్ మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య లక్ష్మీన కుమారుడు కూతురు కరుణాకర్ తో వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజులు సాఫీగా సాగిన సంసారంలో అదనపు కట్నం తో పాటు అనుమానంతో భర్త కమలాకర్ పద్మను వేధించడం ప్రారంభించడం జరిగిందని బంధువులు తెలిపారు. గతంలో పద్మను శారీరకంగా వేధించడంతో కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దల సమక్షంలో సర్ది చెప్పడం జరిగిందన్నారు. ఉదయం భార్య పద్మతో భర్త కమలాకర్ గొడవ పెట్టుకొని వెళ్లడం జరిగిందని, కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు భార్య బెడ్ రూమ్ లో మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పద్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని తమ కూతురిని హత్య చేసిన నిందితుడిని కట్నంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. హత్య చేసి పారిపోయిన కమలాకర్ తీసుకురావాలని పోలీసులతో బంధువులు వారించారు. కొద్దిసేపు మృతురాలి ఇంటిముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
