నవతెలంగాణ – ధూల్ పేట్: ఓ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ ధూల్ పేట్ లోని మంగళహాట్ లోని పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ మహేష్ తెలిపిన వివరాలు ప్రకారం .. ఇందిరా నగర్ వాసి మమత (32) కు 14 ఏళ్ళ క్రితం సతీశ్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రి పిల్లలు, భర్త హాల్ లో ఘాడ నిద్రలో ఉందగా.. మమత ఆమె బెడ్ రూం లోకి వెళ్ళి తలుపులు పెట్టుకుంది. తర్వాత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. భార్య కేకలు విన్న భర్త తలుపులు పగలగొట్టి ఆమెకు అంటుకున్న మంటలను ఆర్పడానికి శతవిధాల ప్రయత్నించాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచారు. కాగా ఆమె ఆత్యహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.