గోవిందరావుపేట మండల భాజపా అధ్యక్షులుగా మార్క సతీష్ ఎన్నికయ్యారు. రాష్ట్ర పార్టీ నియమించిన ఎన్నికల సంఘటన పర్వ్ ములుగు జిల్లా ఇంఛార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి లు నిన్న గురువారం రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో మార్క సతీష్ మండల అధ్యక్షులు గా ప్రకటించారు. మండలంలోని మారుమూల గ్రామ ప్రాంతానికి చెందిన సతీష్ మండల అధ్యక్షునిగా ఎంపిక కావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుందని రుజువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2015 వ సంవత్సరంలో నరేంద్ర మోడీ నాయకత్వానికి, మచ్చలేని పరిపాలనను చూసి ఆకర్షితులై పార్టీ లో చేరి నీతి, నిజాయితీగా కష్టపడి పార్టీ అభివృద్ధికి పనిచేయటం జరిగింది. 2016 లో మండల ఉపాధ్యక్షులు గా, అనంతరం 2017 లో మండల అధ్యక్షులు లేని సమయంలో మండల కన్వీనర్ గా పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీని విజయపథంలో నడిపించటం జరిగింది. మళ్ళీ 2024 సెప్టెంబర్ నెలలో ఆ సమయంలో ఉన్న మండల అధ్యక్షుని రాజీనామా వలన అనివార్య పరిస్థితులలో రెండవసారి మండల కన్వీనర్ గా జిల్లా అధ్యక్షుడు బలరాం నియమించిన తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసె దిశగా పార్టీ సభ్యత్వాలను అత్యదికంగా చేసి జిల్లాలో చేపట్టి తన సమర్ధతను నిరూపించుకోవటం జరిగింది. పార్టీ కోసం నిరంతరం నిస్వార్థంగా కష్టపడటాన్ని గుర్తించిన జిల్లా, రాష్ట్ర నాయకత్వం మండల అధ్యక్షులు గా నియమించి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మార్క సతీష్ మాట్లాడుతూ తనని భాజపా మండల అధ్యక్షులు గా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, మరియు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు, తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.