నవతెలంగాణ-హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. చిన్న గొడవ జరగడంతో భార్యతో పాటు 9 నెలల చిన్నారి కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతనూతలపాడులో దంపతులు సుజాత, వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నారు. వీరికి 9 నెలల చిన్నారి కూడా ఉంది. వంట విషయంలో సుజాతకు భర్త వెంకటేశ్వర్లుతో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన సుజాత 9 నెలల చిన్నారితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లి, బిడ్డ మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. అయితే సుజాత ఆత్మహత్యకు ముందు తన 9 నెలల చిన్నారితో కలిసి చెరువు వైపు వెళ్తున్న దృశ్యాలు స్థానిక టీవీ పుటేజ్‌లో నమోదు అయ్యాయి. వీటి ఆధారంగానే సుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.