నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 22న తెలంగాణ అమరవీరుల సంస్మరణ ర్యాలీని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారుల్ని ఆదేశించారు. జానపద, గిరిజన, దక్కన్, శాస్త్రీయ కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి అమర జ్యోతి వేదిక వరకు ర్యాలీ జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటక, సంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి దీపికా రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.