ఆరువేల మంది కళాకారులతో ‘అమరవీరుల సంస్మరణ ర్యాలీ’

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సాంస్కతిక శాఖకు చెందిన ఆరువేల మందికళాకారులతో వివిధ కళారూపాల్లో ఘనంగా ర్యాలీ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహం నుంచి అమరజ్యోతి వేదిక వరకు నిర్వహించబోయే ‘అమరవీరుల సంస్మరణ ర్యాలీ’కి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ కార్పొరేషన్లకు చెందిన చైౖర్మెన్లు రసమయి బాలకిషన్‌, జూలూరి గౌరీశంకర్‌, దీపికారెడ్డి, మంత్రిశ్రీదేవి, సాంస్కతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడిహరికష్ణ, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌, పురావస్తు శాఖ అధికారులు నారాయణ, నాగరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ కళా వైభవాన్ని, రాష్ట్రం సాధించిన అభివద్ధిని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశ దిశలా చాటాలనీ ఆదేశించారు. తమ ప్రభుత్వం మరుగున పడిన తెలంగాణ ప్రాచీన కళలకు పూర్వ వైభవాన్ని తెచ్చిందని అన్నారు. ఈ ర్యాలీలో తెలంగాణకు చెందిన డప్పుకళాకారులు, ఒగ్గుడోలు, బోనాలు, కోలాటం, గుస్సాడి, కొమ్ముకొయ, లంబాడీ, రాజన్న డోలు, కోలాటం, చిందు యక్షగానం, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, బతుకమ్మలు, షేరి బాజా, మర్ఫాలతో పాటు పేరిణి, కూచిపూడి, భరత నాట్యం, కథక్‌ వంటి శాస్త్రీయ నత్య కళాకారుల ప్రదర్శనలు ఉన్నాయని వివరించారు. తద్వారా అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Spread the love