జన్నారం మండలంలోని చింతగూడలో శనివారం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభను ఆ పార్టీ మండల అధ్యక్షుడు పురం శెట్టి బాపు ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా ఎంఎల్ న్యూ డెమోక్రసీ, జిల్లా కార్యదర్శి జాడి దేవరాజు, మండల అధ్యక్షుడు పురంశెట్టి బాపు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ప్రజల కొరకు పోరాడి దోపిడి వ్యవస్థను తమ్మి కొట్టడానికి కోసం తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి పోరాటం చేసి మృతి చెందిన అమరుల త్యాగాలు మరువలేనివి అన్నారు. వారి ఆశయ సాధన పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి మండలంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పి ఓ డబ్లు జిల్లా కార్యదర్శి రమాదేవి, నాయకులు మల్లేష్ రజిత పోసవ్వ ఏసు తదితరులు పాల్గొన్నారు.