దశాబ్ది ఉత్సవాల్లో అమరవీరుల సంస్కరణ తీర్మానం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ తీర్మానం కొరకు ప్రత్యేక సమావేశం నిర్వహించనైనది . ఈ సందర్భంగా ఎంపీపీ సూడి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ సాధన కోసం అమరులైన వారి కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరగా సభ  రెండు నిమిషాలు మౌనం పాటించనైనది అనంతరం అమరులైన వారి కోసం వారిని స్మరించుకుంటూ తీర్మానం ఆమోదించడమైనది. అమరులైన వారి కోసం తీర్మానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపినారు అమరులైన వారిని స్మరిస్తూ కన్నులకు నీరు తెచ్చుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జే ప్రవీణ్ కుమార్, తాసిల్దార్ అల్లం రాజకుమార్ డిఇ ఇ ఐ బి సి హెచ్ శ్రీనివాస్, ఎంపీ ఓ సాజిదా బేగం, ఎం ఈ  ఓ జి దివాకర్,  కార్యాలయ సూపరిండెండెంట్ కే సాయి దుర్గ లక్ష్మి, ఏపీవో ప్రసూన, పశు వైద్యాధికారి రాజశేఖర్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఇతర అధికారులు మరియు గౌరవ వైస్ ఎంపీపీ శ్రీమతి స్వప్న  ఎంపిటిసిలు ఏలిశాల స్వరూప,లావుడ్యా రామచందర్ చాపల ఉమాదేవి గారలు పాల్గొన్నారు.
Spread the love