నాయకత్వం సీపీఐ(ఎం) కే సాధ్యం…
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
ఏజే రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
ఉమ్మడి భద్రాచలం నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పార్టీ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆనాటి అధికార కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి ఒక వైపు, నక్సలైట్స్ మూకల నుండి మరో వైపు ఉద్యమాన్ని కాపాడుకోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడ్డ యోధులు బండారు చంద్రరావు, బత్తుల భీష్మారవు, శ్యామల వెంకటరెడ్డి తదితరులున్నారు. యలమంచి సీతారామయ్య నుండి బొప్పెన భీమయ్య వరకు నాయకత్వంతో పాటు సున్నం గంగరాజు నుండి పత్రా ముత్యం వరకు విలువైన ఆణి ముత్యాలు వంటి కార్యకర్తలు అనేక మంది నియోజకవర్గం నుండి గ్రామ స్థాయి వరకు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ తరానికి తలలో నాలుకగా పని చేసిన కుంజా బోజ్జి, సున్నం రాజయ్య మాస్ లీడర్లుగా నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మంచి గుర్తింపు పొందారు. పార్టీలో, పార్లమెంటరీ రంగంలో పార్టీ పద్ధతులకు కట్టుబడి పని చేశారు. చనిపోయే రోజు వరకు ప్రజల మధ్యనే ఉన్నారు. సున్నం రాజయ్య కరోనాతో మనకు దూరం కాగా, బొజ్జీ వయోభారంతో మనకు దురయ్యారు.పైన తెలియజేసిన నాయకత్వంలో కొద్ది మంది మాత్రమే మార్క్సిస్ట్ సిద్ధాంత పటిమ కలిగిన వారైతే, మిగిలిన వారంతా ఆ సిద్దాంతాన్ని క్లాసుల ద్వారా విని ఆకళింపు చేసుకుని ప్రజా ఉద్యమాలలో చివరి దాకా నిలబడ్డారు. మార్క్సిస్ట్ యోధులుగా కీర్టించబడు తున్నారు.
వారి ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ చేస్తున్న బీజేపీ వ్యతిరేఖ క్యాంపెయిన్‌ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే అమర వీరులకు ఇచ్చే ఘనమైన నివాళి. వారు ఏ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు నడిపారో, ఆ పోరాటాలను సమరశీలంగా నిర్వహించడమే వారికిచ్చిన నిజమైన నివాళి.