నవతెలంగాణ – సిద్దిపేట
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఉత్తర్వుల ప్రకారం పట్టణంలోని నర్సింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా పోదుట వేల్లీ మేరీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తించుచున్న సునీత తాను గతంలో పనిచేసిన సిరిసిల్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు బదిలీపై వెళ్లడంతో పోదోట వెళ్ళి మేరీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ, విద్యార్థులకు మెరుగైన విద్య సౌకర్యాలను అందిస్తానని అన్నారు. సునీత, నర్సింగ్ కళాశాల ఏ ఓ సురేందర్, సూపర్డెంట్ రామ్ చందర్ లు ఆమెకు అభినందనలు తెలిపారు.