నవతెలంగాణ -మధ్యప్రదేశ్: గర్భిణిపై సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఆపై ఆమెకు నిప్పంటించిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని మురేనా జిల్లాలో చోటు చేసుకుంది. 80% కాలిన గాయాలతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తన భర్త మీద లైంగిక ఆరోపణలు చేసిన ఓ మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు ఆ గర్భిణి వెళ్లినప్పుడు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆమెపై ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ, ఈ ముగ్గురు కలిసి బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితురాలు గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలైన మహిళ భర్త గతంలో ఓ లైంగికదాడి కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చినట్లు సమాచారం.