భారీగా గంజాయి పట్టివేత…

నవతెలంగాణ  – హైదరాబాద్‌: శంషాబాద్‌లో ఎక్సైజ్‌ పోలీసులకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దాదాపు రూ. 7లక్షలు విలువ చేసే 1.65 కిలోల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి చాక్లెట్స్‌ను విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ.60లక్షలు విలువ చేసే 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందుతుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాపై గతంలోనూ ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసులు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు.

Spread the love