జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం..

నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది. లఢఖ్‌లోని కార్గిల్‌ పట్టణానికి ఉత్తరంగా 401 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపంవల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరుగలేదని తెలిపింది.

 

Spread the love