న్యూ కలెడోనియాలో భారీ భూకంపం…

నవతెలంగాణ – హైదరాబాద్: ఫ్రాన్స్‌ భూభాగమైన న్యూ కలెడోనియాను భారీ భూకంపం వణికించింది. లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఈ భూకంపం కారణంగా పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియా, ఫిజీ, వనాటు ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

Spread the love