మ‌ణికొండ‌లో భారీ పేలుడు..

నవతెలంగాణ – హైద‌రాబాద్ : మ‌ణికొండ‌లోని లాల‌మ్మ గార్డెన్‌లో బుధ‌వారం సాయంత్రం భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఒక్క‌సారిగా భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే కెమిక‌ల్ డ‌బ్బాలు పేలిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Spread the love