నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని తిరుమల ఎస్టేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఓ ప్రయివేటు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భయాందోళనలకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.