కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – కరీంనగర్‌
కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరి గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ఈ ప్రాంతంలో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love