మూసారాంబాగ్ లో భారీ అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: మలక్ పేట పరిధి మూసారాంబాగ్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరిలో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరి వద్ద భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు మలక్ పేట పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న సిబ్బంది ఐదు అగ్ని మాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి

Spread the love