నవతెలంగాణ – గుజరాత్
గుజరాత్‌లో రాజ్‌కోట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆనంద్ బంగ్లాచౌక్ సమీపంలోని ఫర్నిచర్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ నుంచి భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నాయి. గోడౌన్ నుంచి పొగలు పెద్ద ఎత్తున్న ఎగిసినపడుతున్న విజువల్స్ వీడియోలో కనిపిస్తున్నాయి.