హరిహర వీరమల్లు సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్
ఈ మధ్య పవన్‌ కొత్త సినిమాలతో తెగ బిజీగా ఉండటంతో హరిహర వీరమల్లును పక్కన పెట్టేశాడు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ఎప్పుడో షూటింగ్‌ను స్టార్ట్‌ చేసింది. అయితే పవన్‌ బిజీ షెడ్యూల్‌ వల్ల షూటింగ్‌కు పలు మార్లు బ్రేకులు పడుతూ వస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా సగానికి పైగా షూటింగ్‌ పూర్తిచేసుంది. ఇక తాజాగా ఈ సినిమా మేజర్‌ షెడ్యూల్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. రేపో మాపో చిత్రీకరణ కూడా స్టార్ట్‌ కాబోతుంది. అయితే ఈ లోపే హరిహర వీరమల్లు సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా కోసం వేసిన సెట్‌లో రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని దుండిగల్ పరిసర ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన కొంత సేపటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ సినిమాలోని మేజర్ షెడ్యూల్‌ కోసం హరిహర వీరమల్లు మేకర్స్‌ దుండిగల్‌ ప్రాంతంలో ఓ భారీ సెట్టింగ్‌ను వేశారు. అయితే ఆ మధ్య కురిసిన భారీ వర్షానికి ఆ సెట్ తీవ్రంగా ధ్వంసమైంది. అలా పాడైన సెట్‌కు మరమ్మతులు చేస్తున్న టైమ్ లోనే అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Spread the love