బీఆర్ఎస్ నుండి బీజేపీలో భారీగా చేరికలు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి :
భీంగల్ మండలం బాబానగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ నాగుల భూమన్న ఆధ్వర్యంలో బాబానగర్ మాజీ సర్పంచ్ రవి, పలువురు యువకులు ఏలేటి అన్నపూర్ణమ్మ  ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. భారత ప్రధాని  నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై ఆదివారం కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో అన్నపూర్ణ సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలేటి  అన్నపూర్ణమ్మ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏలేటి అన్నపూర్ణమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, భీంగల్ మండల అధ్యక్షులు ములిగే మహిపాల్, భూమన్న, రవి, బీజేపీ నాయకులు, కార్యాకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love