మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా నకిలీ నోట్ల పట్టివేత..

నవతెలంగాణ – హైదరాబాద్‌ : మైలార్‌దేవ్‌పల్లిలో నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని చిత్తూరుకు చెందిన నిందితులు గంగరాజు, అభినందన్‌ నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లు స్వాధీనం చేసు కున్నారు. నకిలీ నోట్లను మహారాష్ట్రలో ముద్రిస్తున్నట్లు నిందితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love