తమిళనాడులో భారీగా డీఎస్పీల బదిలీ

నవతెలంగాణ – చెన్నై: తమిళనాడులో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శంకర్‌ జివాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక తిరుమంగళం సహాయ కమిషనర్‌ వరదరాజన్‌ ఎంకేబీ నగర్‌కు, ఎంకేబీ నగర్‌ సహాయ కమిషనర్‌ పరంధామన్‌ తిరుమంగళంకు బదిలీ అయ్యారు. కాంచీపురం డీఎస్పీ మణిమేఘలై అదే జిల్లా క్రైం విభాగానికి, కాంచీపురం కొత్త డీఎస్పీగా మురళి నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న సహాయ కమిషనర్‌ పాల్‌స్టీఫెన్‌ చెన్నై కేంద్ర క్రైం విభాగానికి, కృష్ణగిరి, మదురై, తిరువణ్ణామలై, విరుదునగర్‌, తంజావూరు ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు బదిలీ అయ్యారు.

Spread the love