తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్​ల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ నియమితులయ్యారు. కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌, చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య నియామకం కాగా.. హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌ నియమితులయ్యారు. టీపీటీఆర్‌ఐ డీజీగా అహ్మద్‌ నదీమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సందీప్‌ సుల్తానియాకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కొనసాగనున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి, జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, హౌసింగ్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ముఖ్యకార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి, రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబరితి, విద్యుత్‌శాఖ కార్యదర్శిగా రొనాల్డ్‌ రోస్, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్‌ రోస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా ఏ.వి. రంగనాథ్​ నియమితులయ్యారు. కళాశాల, సాంకేతకి విద్యాశాఖల కమిషనర్‌గా శ్రీదేవసేన, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌, సెర్ప్‌ సీఈవోతో పాటు ప్రజావాణి నోడల్‌ అధికారిగా దివ్యకు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. రోడ్లు, భవనాల ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన నియమితులయ్యారు.

Spread the love