నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర RTC అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య IPL మ్యాచ్ నేపథ్యంలో TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన చేశారు. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడుపుతోందని చెప్పారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అలాగే స్పెషల్ మెట్రో కూడా వేస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.