రోడ్డు ప్రమాదంలో గణిత ఉపాధ్యాయుడు మృతి

నవతెలంగాణ-పెన్ పహాడ్
రోడ్డు ప్రమాదంలో గణిత ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా బోధిస్తున్న ఎం వెంకన్న పెన్ పహాడ్ నుండి సూర్యాపేటకు బైక్ మీద వెళుతుండగా సింగారెడ్డిపాలెం డబుల్ బెడ్ రూమ్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్  బైక్ స్టాండ్ కు తగిలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు.
Spread the love