ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ వర్ధంతి  

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 66వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతులమీదుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ  సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం,ఆస్వాతంత్ర సమరయోధుడు భారతరత్న దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్  66వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  చేతులమీదుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జైలు జీవితం గడిపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో సుధీర్గ కాలం పని చేసి దేశానికే తొలి విద్య శాఖః మంత్రి గా పని చేసారని అన్నారు.అతడు ఆల్ హిలాల్ పత్రిక ను కూడ స్థాపించాడని అన్నారు.దానితో పాటు మౌలానా ఆజాద్ విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పాడని చాలా మంది అక్కడ చదువుకొని మంచి హోదాలో ఉన్నారని, నేటి యువత కూడా మౌలానా ఆజాద్ అడుగు జాడల్లో నడవాలని మైనారిటీ లకు పిలుపునిచ్చారు.
Spread the love