బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి. బీట్‌రూట్ ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
– బీట్‌రూట్ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
– బీట్‌రూట్ ఆకులలో నైట్రస్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
– ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి చర్మాన్ని కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్‌లతో పాటు అవసరమైన విటమిన్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు కొల్లాజెన్‌ను పెంచడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
– బీట్‌రూట్ ఆకుల రుచి తీపిగా ఉంటుంది.. కాబట్టి జ్యూస్ చేసుకుని తాగవచ్చు లేక కర్రీగా కూడా చేసుకోవచ్చు. అదీకాకపోతే పకోడా కూడా తయారు చేసుకోవచ్చు.