మీ బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా…

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య
– డబ్బుల సంచులతో ఓట్లను కొనాలని చూస్తున్నారు
– ప్రజలే బీఆర్‌ఎస్‌ కు బుద్ధి చెప్తారు
నవతెలంగాణ- బొమ్మలరామరం: మీ బిడ్డగా మీ ఇంటికి వస్తున్న ఒక్కసారి అవకాశం ఇస్తే ఆలేరును రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు. మండలంలోని మైసిరెడ్డిపల్లి హాజీపురం పకీర్ గూడెం తిరుమలగిరి నాగినేనిపల్లి బొమ్మలరామారం మల్యాల తర్వాతపురం పాత రంగాపురం కొత్త రంగాపురం రామలింగంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆయన అన్నారు. బొమ్మలరామారం మండలం అభివృద్ధికి నోచుకోకుండా ఉందని గత పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన గొంగడి సునీత రోడ్లను కూడా కనీసం వేయలేదని హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న మండలంలోని ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా మండలంలో పరిస్థితి ఇంకా అద్వానంగా ఉందని వారి ఆస్తులను పెంచుకోవడం పైన ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పైన లేదని ఇప్పుడు డబ్బుల సంచులతో ఓట్లను కొనాలని చూస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని కచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అండెంసంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, మహిళా అధ్యక్షురాలు సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, ఆలేరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నందు రాజు గౌడ్,మాజీ జెడ్పిటిసి సభ్యులు చీర్ల రాజేశ్వర్ యాదవ్, మర్రి కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు హేమంత్ రెడ్డి, శ్రీహరి నాయక్, నాయకులు రాజు నాయక్, పైలెట్ రాజేష్,రామస్వామి, ఈశ్వర్, భగవంతు రెడ్డి, చీర సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love