– కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటీల్..
నవతెలంగాణ – జుక్కల్
ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తులను ఏరోజుకోఆరోజు కంప్యూటర్లో నమేాదు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటీల్ అధికారులకు ఆదేశించారు. శనివారం నాడు మండలంలోని కౌలాస్ గ్రామములోని గ్రామ పంచాయతి కార్యాలయం అవరణలో ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్న క్యాంపును కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మతో కలిసి దరఖాస్తులను పరీశీలించారు. అధికారులతో మాట్లాడుతు దరఖాస్తుదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా దరఖాస్తుల స్వీకరణ నిర్వహించాలని, ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునేల అవగాహన పరచాలని ఆదేశించారు. దరఖాస్తు నింపె క్రమంలో సమస్యలు తలెత్తకుండా అధికారులు యువకులకు స్వచ్చందంగా ముందుకు వచ్చే వారితో నింపించాలని సూచించారు. కలెక్ట్రర్ తో పాటు ఎస్పీ, పోలీసు శాఖ అధికారులు, ఎంపిడివో నరేష్ , ఎంపివో యాదగిరి, తహసీల్దార్ గంగా ప్రసాద్, ఆర్ఐ రామ్ పటేల్, ఈజీఎస్ ఈసీ స్వామీ, టీఏ రవిందర్, జేపిఎస్ లు తదితరులు పాల్గోన్నారు.