ఒంటరిగానే పోటీ చేస్తా: మాయావతి

నవతెవల- లక్నో :  2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి బుధవారం ప్రకటించారు. ఏదైనా కూటమిలో చేరనున్నారంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఎన్‌డిఎ, ప్రతిపక్ష కూటమి ఇండియా రెండూ పేదల వ్యతిరేక, కుల తత్వ పార్టీలని పేర్కొన్నారు. 2007లో ప్రతిపక్షాల మోసానికి, అవకతవకలకు గురవడం కన్నా.. నిర్లక్ష్యానికి గురైన, నిరాశ్రయులైన కోట్లాది మంది ప్రజల సోదరిభావాన్ని కలుపుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మాయావతి ట్విటర్‌లో పేర్కొన్నారు.

Spread the love