కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’

నవతెలంగాణ – హయత్‌నగర్‌
మేడే స్ఫూర్తితో భవిష్యత్‌ ఉద్యమాలకు రూపకల్పన చేసుకోవాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి అన్నారు. మే డే ఉత్సవాలను హయత్‌ నగర్‌ మండల సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గోల్కొండ నాగరాజు సారధ్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తర్వాత ఆటోనగర్‌ ఇసుక లోడింగ్‌ అన్లోడింగ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా సబ్‌ కమిటీ సభ్యులు సామిడి శేఖర్‌ రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రమావత్‌ సక్రు నాయక్‌, ఎ.ఐ.వై.ఎప్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలోజు, లక్షణాచారి ఎ.ఐ.యస్‌.ఎప్‌ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సామిడి వంశీ వర్ధన్‌ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి శ్రీదేవి, ఇసుక లోడింగ్‌ అన్లోడింగ్‌ సంఘం కార్యదర్శి సురేందర్‌, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుజాత, సరిత, అటో ట్రాలీ యూనియన్‌ అధ్యక్షుడు బిచుపల్లి. శంకర్‌, బి.ఒ.సి. నాయకులు జాని, వేంకట్‌, చంది వేంకట్‌, యువజన సంఘం నాయకులు శోభన్‌, యనమల్ల.శ్రీకాంత్‌, ముత్తయ్య, రాములు, సోషల్‌ మిడియా వారియర్స్‌ మమత, ప్రజాసంఘాల నాయకులు, కార్మిక శ్రేణులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – హయత్‌ నగర్‌
మే డేను పురస్కరించుకొని హయత్‌నగర్‌లోని ఆర్టీసీ 1,2 డిపోల వద్ద, బొమ్మల గుడి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వద్ద, హయత్‌ నగర్‌ బస్‌ స్టాండ్‌లలో జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా శాఖ ఆర్గనైజర్‌ భీమనపల్లి కనకయ్య, కామ్రేడ్‌ శ్రీనివాస్‌ రెడ్డిలు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్మికుల పక్షాన మాట్లాడేటటువంటి సీపీఐ(ఎం) అభ్యర్థి కామ్రేడ్‌ జహంగీర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

నవతెలంగాణ- నాగోల్‌
సీఐటీయూ ఆధ్వర్యంలో నాగోలు డివిజన్లో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూ నాగోల్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం కోశాధికారి ఎండి లతీఫ్‌ అధ్యక్షతన నిర్వహించిన మే డే ఉత్సవాలకు భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కోశాధికారి జి చైతన్య, కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి మనోహర్‌, సరూర్నగర్‌ సర్కిల్‌ సీఐటీయూ కన్వీనర్‌ మల్లెపాక వీరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై సీఐటీయూ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో సీపీఐ(ఎం) పార్టీ కన్వీనర్‌ సిహెచ్‌ వెంకన్న, ఆంజనేయులు, రజక సంఘం సి మల్లేష్‌, న్యూ నాగోల్‌ కమిటీ అధ్యక్షులు డి. రవి, కమిటీ సభ్యులు మీ సైదయ్య, ఎం జానకి రాములు, తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – నాగోల్‌
మేడే సందర్భంగా నాగోలు ప్రధాన కూడలి గాంధీ సెంటర్లో బుధవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ వేడుకలలో ఉప్పల్‌ మండల కార్యదర్శి పులిరాం నారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఉడతల మల్లేష్‌ గౌడ్‌, ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డుపల్లి కష్ణ, భూపతి, సురేష్‌, ఎండి బషీర్‌, వెంకటేశ్‌, రాములు, జంగయ్య, నర్సింహా రావు, సైదరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం..
నవతెలంగాణ – చైతన్యపురి
శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం అని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. శ్రీదేవి అన్నారు. వనస్థలిపురంలోని అంకిత ఎన్జీఓ, డిఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకో పరిమితం కాదు.. శ్రమదోపిడిని నిరసిస్తూ యావత్‌ ప్రపంచ కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’ అని అన్నారు. అనంతరం అంకిత వారి ఆధ్వర్యంలో అర్హులైన వారికి లేబర్‌ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం, హిరియా నాయక్‌, డాక్టర్‌ బిగాడ్‌ అహ్మద్‌, దేవేంద్ర చారి, తౌఫీఖ్‌ కార్మికులు పాల్గొన్నారు.

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకొని తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పరిధిలోని కోహెడ, తొర్రూరు, మునగనూర్‌, బ్రాహ్మణపల్లి, ఇంజాపూర్‌, కమ్మగూడ, రాగన్నగూడ, తుర్కయంజాల్‌ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల, పరిశ్రమల కార్మికులు బుధవారం ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తుర్కయంజాల్‌ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం నుండి రొక్కం సత్తిరెడ్డి కళ్యాణ మండపం వరకు కార్మికులు, ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించి హాల్‌ ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి. కిషన్‌ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్‌ తుర్కయంజాల్‌ సీఐటీయూ నాయకులు ఎం. సత్యనారాయణ, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌, అడ్వకేట్‌ కె. అరుణ్‌ కుమార్‌, నాయకులు భాస్కర్‌, శంకర్‌, వెంకట కష్ణ, శంకరయ్య, మాల్యాద్రి, కష్ణ, రవి, మధు, శారద, బీరప్ప, బాల్‌ రాజ్‌, ఆశీర్వాదం, మాధవ రెడ్డి, జాఫర్‌, మెతరి దాసు, నవీన్‌, మహేష్‌, యాదగిరి, గోపాల్‌, శ్రీను, రవి, లక్ష్మి, జంగమ్మ, పుష్పమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ- నాగోల్‌
నాగోల్‌ డివిజన్‌ జైపూర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మేడే సందర్భంగా జైపూర్‌ కాలనీ చౌరస్తాలో జెండా ఎగుర వేశా రు. ఈ కార్యక్రమంలో బషీర్‌ అలీ, జైపూర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్యామల యాదగిరి, కాలనీ వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌, శ్రీనివాసులు, జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌ పోతని, జాయింట్‌ సెక్రెటరీ కస్తూరి అశోక్‌, రాజు యాదవ్‌, శ్రీశైలం యాదవ్‌, రమేష్‌, అమరేందర్‌, శ్రీనివాస్‌ సిహెచ్‌.వెంకటేష్‌, రాజ మల్లయ్య, ఏ వెంకటేష్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – బడంగ్‌పేట్‌
ప్రజా పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చిగిరింత మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కుర్మల్‌గూడ 10వ డివిజన్‌లో జన్నారం కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు మేయర్‌ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కుర్మల్‌గూడ10వ డివిజన్‌ జన్నారం కాలనీలో రికవరీ హాస్పిటల్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మేయర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంగర్‌ అండ్‌ కరంచారి కాంగ్రెస్‌(కె.కె.సి) పార్టీ చైర్మన్‌ కౌసల్‌ సమీర్‌, ప్రధాన కార్యదర్శి రుద్రాక్షణ మల్లేష్‌, కె.కె.సి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మైన, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కవిత, నాయకులు ఆనంద్‌ రెడ్డి, ఎల్లేష్‌, జంపయ్య, మధు పాల్గొన్నారు.

నవతెలంగాణ – చైతన్యపురి
సీఐటీయూ సరూర్‌నగర్‌ సర్కిల్‌ కన్వీనర్‌ మల్లెపాక వీరయ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ వెంకన్న, మనోహర్‌, జీ చైతన్య, సి నవీన్‌, ఎండి లతీఫ్‌ , మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – ఎల్బీనగర్‌
జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కర్మన్‌ ఘాట్‌ చౌరస్తాలో మే డే సంద ర్భంగా సీఐటీయూ జెం డాను మహిళా కార్మికురాలు పొన్నమ్మ ఎగురవేశారు. అనంతరం సీఐ టీయూ జీహెచ్‌ఎంసీ ఎంప్లా‌యిస్‌ యూనియన్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల్లారా ఏకంకండి..మతోన్మాద విచ్ఛిన్నకరమైన శక్తులను ఓడించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగయ్య, జీహెచ్‌ఎంసీ సూపర్వైజర్‌ రావుల శేఖర్‌, సంతోష్‌ వినరు రావు, కార్మికులు జయమ్మ, మంజుల, కళావతి, స్వరూప, రాజేశ్వరి, జి లక్ష్మి, అనురాధ, హేమలత, ఎన్‌ లక్ష్మి పాల్గొన్నారు.

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
మేడే స్ఫూర్తితో కార్మికులు తమ సమస్యలపై పోరాటాలు చేయాలని ఏ ఐటీ యూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య కార్మికులకు పిలుపు నిచ్చారు. మే డే దినోత్సవం సందర్భంగా తుర్కయంజాల్‌ చౌరస్తాలో ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి. శివకుమార్‌, ఏఐటీయూసీ నాయకులు కాటంరాజు, కొండి గారి శివ, గువ్వలరాజు, చెక్క యాద గిరి, భాస్కర్‌, ఆనంద్‌ సుందరమ్మ, మల్లేష్‌, శ్రీకాంత్‌, విజయ శ్రీనివాస్‌, కష్ణ, నారా యణ, నాగరాజు, నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

నవతెలంగాణ- హస్తినాపురం
హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని భూపేష్‌ గుప్తా నగర్‌లో మేడే సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మంథని యాదయ్య బుధవారం జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు గడ్డం రవీందర్‌, కే.రాములు, కస్తూరి శ్రీను, మహిళా సంఘం నాయకులు కమార్‌ , సంతోష్‌, శ్రీను, మున్సిపల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – బడంగ్‌పేట్‌
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కాలనీలో ప్రజా కార్మిక సంఘం, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నబారు ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదయ్య, యాదగిరి చారి, కమిటీ సభ్యులు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
అదేవిధంగా జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షులు గౌడల్లి దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – మీర్‌ పేట్‌
మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేస్తున్న సీఐటీయూ నాయకులు దాసరి బాబు, యాదగిరి చారి, యాదగిరి తదితరులు..
నవతెలంగాణ- సంతోష్‌నగర్‌
మే డే సందర్భంగా సింగరేణి కాలనీలో సీపీఐ సీనియర్‌ నాయకుడు శంకర్‌ నాయక్‌, డివిజన్‌ కార్యదర్శి షేక్‌ మహమూద్‌, ఏఐటీయూసీ ఆటో యూనియన్‌ హైదరాబాద్‌ కార్యదర్శి జంగయ్య, సీపీఐ నాయకులు అంజయ్య, శామ్‌, రవి తదితరులు జెండాను ఎగురవేశారు.

Spread the love