సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: మేయర్ పారిజాత నర్సింహారెడ్డి

నవతెలంగాణ బడంగ్ పేట్:  కాంట్రాక్టర్లు సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి అన్నారు.బుధవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 32వ డివిజన్ లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల అవరణంలో చేపడుతున్న సీసీ నిర్మాణ పనులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి స్థానిక కార్పొరేటర్ గౌర రమాదేవి శ్రీనివాస్, డీఈఈ అశోక్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శ మున్సిపల్ గా తీర్చి దిద్దటానికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love