నేటివరకు ఎంబీబీఎస్‌ రిపోర్టింగ్‌ గడువు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ రెండవ విడత ప్రవేశాల రిపోర్టింగ్‌ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగిస్తున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఈ గడువు గురువారంతోనే ముగియనుండగా, అభ్యర్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచాలని ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారుల్ని ఆదేశించారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.

Spread the love