నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని కర్నూలు జిల్లాలోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి చనిపోయాడు. ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లోకేష్ తండ్రి బ్రహ్మానందరావుకి పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. లోకేష్ ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు డేటా చెక్ చేస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.లోకేష్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలిగా పోలీసులు గుర్తించారు.